Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?

Allari Naresh daughter at Ugram Pre Release Event

అల్లరి నరేష్(Allari Naresh).. కొంత కాలం క్రితం వరకూ ప్రేక్షకులంతా ఈ హీరోని అల్లరోడని ముద్దుగా పిలిచుకునేవారు. కానీ నేను, గమ్యం(Gamyam) వంటి సినిమాల తర్వాత అల్లరి నరేష్ కామెడీయే కాదు.. సీరియస్ పాత్రల్లో సైతం అద్భుతంగా నటించగలడని నిరూపించాడు. ప్రేక్షకుల చేత గమ్యం సినిమాలో అయితే కన్నీళ్లు కూడా పెట్టించాడు. ఇక మహర్షి సినిమాలోనూ అంతే. తొలుత ఒక అమాయకుడిగా ఉండే అల్లరి నరేష్ క్యారెక్టర్ ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించింది.

ఇక నాంది(Nandi) సినిమా అల్లరి నరేష్‌(Allari Naresh)కు మాంచి మైలేజ్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఉగ్రం(Ugram) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పేరులోనే ఉంది ఉగ్రమని. ఇందులోనూ మనోడు చాలా సీరియస్ పాత్రలో నటించాడని తెలుస్తోంది. మొత్తానికి మన అల్లరోడు కామెడీ ఇమేజ్ చట్రం నుంచి బయటపడ్డాడు. నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని సైతం రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఈ చిత్రంలో నటించిన ఓ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో అలరించింది. ఆ పాప మరెవరో కాదు.. అల్లరి నరేష్ కూతురు(Allari Naresh daughter).

సినిమా చాలా బాగుందని.. తాను బాగా నటించానని అందరూ కచ్చితంగా చూడాలంటూ క్యూట్ క్యూట్‌గా చెప్పేసింది. అంతేకాదు.. పాట కూడా పాడి అలరించింది. ప్రస్తుతం మూడో తరగతిలోకి వచ్చానని తెలిపింది. అయితే పెద్దయ్యాక ఏమవుతావని యాంకర్ అడగ్గా సమంత అవుతానంటూ ఈ చిన్నారి సమాధానం చెప్పింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!