‘పుష్ప 2’లో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి ఇంట్రస్టింగ్ టాక్..

Allu Arjun In Pushpa 2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ పుష్ప 2. తొలి పార్ట్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్స్ సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. రూ.1500 కోట్ల టార్గెట్‌తో అల్లు అర్జున్ పని చేస్తున్నాడు. ఈ సినిమాకు తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు టాక్ నడుస్తోంది. 

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వినవస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక నియంత మాదిరిగా కనిపించనున్నాడట.  స్మగ్లింగ్ లో ఆయనను మించిన తోపు ఎవరూ లేరన్నట్టుగా బన్నీని సుక్కు చూపించబోతున్నాడట. స్మగ్లింగ్‌లో టాప్ రేంజ్‌కి వెళ్లిపోయిన పుష్పరాజ్.. సిస్టం మొత్తాన్ని తనే రూల్ చేస్తాడట. ఒకానొక టైంలో పుష్ప తన మనుషులపైనే రివేంజ్ తీర్చుకుంటాడని టాక్. మొత్తానికి పార్ట్ 2లో బన్నీ నెగిటివ్ షేడ్‌లో కనిపించబోతున్నాడట. 

తనకి.. తన స్మగ్లింగ్‌కి ఎవరు అడ్డువచ్చినా వాళ్ళను లేపేయడానికి కూడా వెనుకాడడని టాక్. ఇక ఈ సినిమాలో గర్వం ఎక్కువైపోయిన పుష్ప ఓ రూలర్‌లా మారిపోతాడట. చివరకు తన భార్య రష్మిక కారణంగా మనిషిలా మారతాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా అయితే బన్నీ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళుతుందనడంలో సందేహం లేదు. అందుకేనేమో తన రెమ్యూనరేషన్‌ను బన్నీ రూ.150 కోట్లకు పెంచాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Google News