ఆ బాధల నుంచి గట్టెక్కించే వీరుడిగా వీరమల్లు.. టీజర్ ఏం చెబుతోందంటే..

ఆ బాధల నుంచి గట్టెక్కించే వీరుడిగా వీరమల్లు.. టీజర్ ఏం చెబుతోందంటే..

ఊరించి ఊరించి ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో పవన్‌ను అయితే ఓ రేంజ్‌లో లేపేశారు. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. ఏమైందో ఏమో కానీ ఆ తరువాత ఆయన తప్పుకుని.. ఇప్పుడు సినిమా బాధ్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నారు. దీంతో టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్‌లో సినిమా కాన్సెప్ట్‌ను అయితే రివీల్ చేసేశారు. 

హరిహర వీరమల్లు చిత్రం రెండు పార్టులుగా రూపొందనుంది. తొలి పార్ట్‌కు స్వార్డ్ vs స్పిరిట్ అనే ట్యాగ్ ఇచ్చారు. దేశంలో దొరల పాలన, నవాబుల దాడులు, మొఘల్ చక్రవర్తుల ఆధిపత్యం పెచ్చుమీరినప్పుడు జనాలు పడిన బాధలు.. వారిని ఆ బాధల నుంచి గట్టెక్కించే వీరుడిగా వీరమల్లును చూపించబోతున్నారని టాక్. మనల్ని దొర దోచుకుంటే.. ఆయనను నవాబు.. నవాబును ఢిల్లీ మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు. వీరందరి నుంచి జనాన్ని రక్షించడానికి భగవంతుడు ఒక వ్యక్తిని పంపిస్తాడని టీజర్ సారాంశం.

ఆ బాధల నుంచి గట్టెక్కించే వీరుడిగా వీరమల్లు.. టీజర్ ఏం చెబుతోందంటే..

మొఘల్ చక్రవర్తిగా సన్నీడియోల్ బాగా ఆకకట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ వీరమల్లు క్యారెక్టర్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తోంది.  అయితే ఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ కనిపించనుంది. అయితే ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించారు.