పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. బన్నీ లుక్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా..

పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. బన్నీ లుక్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఎంత పెద్ద హిట్ అనేది చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో పుష్ప 2పై అంచనాలు రెట్టింపయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని బన్నీ ఫ్యాన్స్ అయితే కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. దీంతో సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది.  

ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ లుక్‌ను విడుదల చేసింది. రష్మిక నగలు ధరించి చాలా అందంగా కనిపించింది. ఇక నేడు (సోమవారం) అల్లు అర్జున్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘పుష్ప ది రూల్‌’ టీజర్‌ విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే గూస్‌బంప్స్ పక్కా. సినిమాలో కీలకంగా సాగే జాతర సన్నివేశాలతో ఇది సిద్ధమైంది.

పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. బన్నీ లుక్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా..

చీర కట్టు, మాస్ లుక్స్‌తో బన్నీ మునుపెన్నడూ కనిపించని రీతిలో కనిపించాడు. యాక్షన్ సీన్స్ కేక అనే చెప్పాలి. గంగమ్మ జాతరలో ఫైటింగ్ సన్నివేశంలా అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడని మొదటి భాగంలో చూపించారు. ఇప్పుడు ఈ రెండో భాగంలో ఏం చూపించనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.