ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్ కారణమా?

ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్ కారణమా?

సినీ నటులు ఎంత తొందరగా ఒక్కటవుతారో.. అంతే తొందరగా విడిపోతుంటారు కూడా.. నాగ చైతన్య, సమంత జంట ఈ కోవకు చెందినదే. అలాగే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే హీరో ధనుష్, ఐశ్వర్యలు మాత్రం కాస్త డిఫరెంట్. ఈ జంట 20 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత విడిపోయింది. 20 ఏళ్లంటే మామూలు విషయం కాదు.

అన్నేళ్లు కాపురం చేశాక విడిపోవడమే చాలా మందిని షాక్‌కి గురి చేసింది. ఈ జంటకు ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు. వీరిద్దరి విడాకులు తీసుకోవడానికి కారణాలు చాలానే బయటకు వచ్చాయి. అయితే విడిపోతారంటూ వార్తలు కూడా చాలా కాలం క్రితం నుంచే వచ్చాయి కానీ ఐశ్వర్య తండ్రి, సూపర్ స్టార్ రజినీ కాంత్ వీరిద్దరి మద్య ఎప్పటికప్పుడు వివాదం సమసిపోయేలా చేశారట.

ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడానికి మ్యూజిక్ డైరెక్టర్ కారణమా?

అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటూ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీనిలో నిజమెంతో అబద్దమెంతో కానీ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో ‘సుచీ లీక్స్’ పేరుతో కొన్ని వీడియోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సుచీ లీక్స్ ద్వారానే ధనుష్, అనిరుథ్ చేసిన పనులు జనానికి తెలియడంతో ఇక ఐశ్వర్య.. ధనుష్‌తో ఉండలేక పోయిందట. దీంతో తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట.