మళ్లీ ప్రేమలో మెగా డాటర్ నిహారిక.. ?

మళ్లీ ప్రేమలో మెగా డాటర్ నిహారిక.. ?

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రేమలో పడ్డారా..? తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారా..? అంటే తాజా పరిణామాలు చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే.. ఉగాది పండుగ సందర్భంగా సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో తమ అభిమానులు, ప్రజలకు శుభాకాంక్షలు చెబుతుంటే నిహారిక మాత్రం ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంతకీ ఏం జరిగింది..? ఆమె పోస్టుకు అర్థమేంటనేది..? చూసేద్దాం రండి..!

ఇదీ అసలు సంగతి..!

విడాకుల తర్వాత చాలా సార్లు ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇక పెళ్లి వద్దనుకుని ఎంచక్కా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం.. అయితే సినిమా లేకుంటే వెబ్ సిరీస్ చేసుకుంటూ.. నిర్మాతగానూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ వస్తోంది. సడన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైన నిహారిక.. ఏనుగుల జంట ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఏనుగులు రెండూ ముఖాలు దగ్గరగా పెట్టుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాయి. అంతేకాదు తొండాలు కూడా రెండూ కలిసిపోయి దగ్గరగా ఉన్నాయి. దీంతోపాటు రెడ్ హార్ట్ సింబల్ కూడా జోడించింది నిహారిక. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్యార్ మే..!

ఈ పోస్టు చూసిన మెగాభిమానులు, సినీ ప్రియులు నిహారిక ప్రేమలో పడిందని.. అందుకే ఇలా తన ప్రేమను వ్యక్తపరుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య ఓ బిజినెస్‌మెన్‌తో కుమారుడితో ప్రేమలో పడిందని కొందరు.. కాదు కాదు ఇండస్ట్రీలోని ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని మరికొందరు రూమర్స్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏనుగుల ఫొటో బాగుందని.. తనకు నచ్చిందని చెప్పడానికి ఇలా పోస్టు పెట్టిందనే టాక్ కూడా నడుస్తోంది. అబ్బే ప్రేమ, దోమ, పెళ్లిపై ప్రస్తుతానికి నిహారికకు ఇంట్రెస్టే లేదని.. ఫోకస్ అంతా కెరీర్‌పైనే అని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆ మధ్య తప్పకుండా తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. నిహారిక చెప్పిన ఆ మాటలు.. ఇవాళ్టి ఈ పోస్టుకు ఎక్కడో సింక్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీలో త్వరలోనే బాజాలు మోగే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నాయని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Google News