పుష్ప-2లో అల్లు అర్జున్ చీర ఎందుకు కట్టాడబ్బా..?

పుష్ప-2లో అల్లు అర్జున్ చీర ఎందుకు కట్టాడబ్బా..?

పుష్ప-2లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీర ఎందుకు కట్టుకున్నాడు..? ఇప్పుడీ ప్రశ్నే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు, మోగాభిమానుల్లో ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడీ టీజర్ యూట్యూబ్‌ను దున్నేస్తోంది. ఈ టీజర్ చూసిన జనాలంతా అసలు అల్లు అర్జున్ చీర కట్టుకోవడమేంటి..? కొంపదీసి రెండో పార్టులో ట్రాన్స్‌జెండర్‌గా మారిపోతాడా..? ఇదొక రెండు నిమిషాల సీన్ అంతేనా..? అంటూ లేని పోని అనుమానాలు అభిమానులకు వచ్చేస్తు్న్నాయ్.

ఇదీ అసలు సంగతి!

పుష్ప సినిమా మొత్తం ఎర్రచందనం, శేషాచలం అడవుల చుట్టూనే తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది ఉమ్మడి చిత్తూరు, ప్రస్తుత తిరుపతి జిల్లాలో ఉంది. అందుకే యాస, వేషం.. అంతా అచ్చు గుద్దినట్లుగా చిత్తూరులో మాట్లాడినట్లే ఉంటుంది. పుష్ప-1లో మొత్తం యాసను దించేసిన అల్లు అర్జున్.. పుష్ప-2లో వేషం కూడా దించేస్తున్నారట. తిరుపతిలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీతాతయ్య గుంట చిన్న గంగమ్మ జాతర అంటే తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అంతటి ప్రాముఖ్యత ఈ జాతరకు ఉంటుంది. ఇంతటి ప్రసిద్ధి పొందిన జాతరను సినిమాలో భాగం చేసింది చిత్ర యూనిట్. జాతరలో మగవాళ్లు చీరలు కట్టుకోవడం మామూలే. బైరాగివేషం ,బండవేషం, తోటి వేషం, దొరవేషాలను తొలి నాలుగురోజుల్లో మగవాళ్లే ధరిస్తుంటారు. ఇక ఐదో రోజున మాతంగి వేషం ధరిస్తారు.. ఆ రోజే అసలు సిసలైన హడావుడి ఉంటుంది. ఇలా మగవారు ఆడవేషం వేసుకుని ఆడిపాడితే.. అమ్మవారు అనుగ్రహించి కోరిన కోర్కెలు తీరుస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఈ జాతర జరిగేటప్పుడు గ్రామస్థులు ఎవరూ ఊరు విడిచి వెళ్లరాదు.. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ ఊరిలో ఉండకూడదు. చీకటి పడేలోపు ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోవాల్సిందే.

పుష్ప-2లో అల్లు అర్జున్ చీర ఎందుకు కట్టాడబ్బా..?

అర్థమైందా పుష్పా!

సినిమా మొత్తం చిత్తూరు నేపథ్యంలో తీస్తున్నారు కాబట్టి అక్కడ జరిగే ప్రతి విషయాన్ని సినిమాలో చెప్పడానికే ఇలా సీన్ చేశారని టాక్ నడుస్తోంది. మరోవైపు.. ఈ జాతరలోనే పెద్ద ఫైట్ కూడా ఉంటుందనే చర్చ కూడా సినీ ప్రియుల్లో నడుస్తోంది. చూశారుగా.. ఇదీ బన్నీ చీర వెనుక ఉన్న కథ. మరోవైపు.. ఈ పార్టులో శ్రీవల్లి చనిపోతుందని.. ఆమె చీర అల్లు అర్జున్ కట్టుకుని ఇలా జాతరలో పాల్గొని.. విలన్, రౌడీలు అందర్నీ అంతమొందిస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్‌లో నడుస్తోంది. ఇక జాతర సీన్‌ కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేక్‌లు తీసుకున్నారని తెలుస్తోంది. చీర కట్టుకుని తాండవం చేయడమంటే మామూలు విషయం కాదని.. రియాల్టీలోకి వచ్చేయాలని మళ్లీ.. మళ్లీ షాట్‌లు తీసుకున్నాడట సుకుమార్. మరోవైపు.. ఆ చీర బన్నీ వాళ్ల అమ్మదని.. సెంటిమెంట్‌ కోసం ఇలా కట్టుకున్నాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా మొత్తం మీద ఈ చీర కట్టులో ఫైట్ హైలైట్ అని తెలుస్తోంది. ఇది ఇంటర్వెల్‌కు ముందు ఉంటుందట. చూడాలి మరి.. ఈ సీన్ వెనుక అసలు కథ ఏముందో.. చిత్ర యూనిట్ ఏం చెబుతుందో..!

Google News