ముసలోడే కానీ మహానుభావుడంటూ బోనీపై నెటిజన్ల సెటైర్స్..

ముసలోడే కానీ మహానుభావుడంటూ బోనీపై నెటిజన్ల సెటైర్స్..

అజయ్ దేవగణ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్. ఈ చిత్రం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. ఇది బయో పిక్ కావడంతో జనం నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ సయ్యద్‌ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 

అయితే మంగళవారం సాయంత్రం ముంబైలో బి-టౌన్ సెలబ్స్ కోసం ‘మైదాన్’ స్క్రీనింగ్ జరిగింది. దీనికి చిత్ర నిర్మాత బోనీ కపూర్ సహా యూనిట్ మొత్తం హాజరైంది. ఇక ప్రియమణి ఈ ఈవెంట్‌కు పద్ధతిగా చీరలో హాజరైంది. ప్రియమణికి బోనీ చక్కగా స్వాగతం పలికారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. ప్రియమణి భుజంపై ఒక చేయి.. నడుము చుట్టూ ఒక చేయి వేసి ఆమెను బోనీ పొదివి పట్టుకున్నారు. ఇది నెటిజన్లకు ఏమాత్రం నచ్చలేదు. ముసలోడే కానీ మహానుభావుడంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

ప్రియమణితో బోనీ అనుచితంగా ప్రవర్తించారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలున్న తండ్రి ఒక నటితో ప్రవర్తించాల్సిన పద్ధతి ఇదేనా? అంటూ మండి పడుతున్నారు. ఒక నటితో బోనీ అలా ప్రవర్తిస్తారని ఊహించలేదంటూ మండిపడుతున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయమంటూ ఏకి పారేస్తున్నారు. గతంలో కూడా బోనీపై ఇలాంటి పనే చేసి అడ్డంగా బుక్కయ్యారు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ని ప్రారంభించారు. అప్పుడు కూడా జిగి హడిద్ బేర్ నడుముపై చెయ్యి వేసి ఫోటోలకు బోనీ ఫోజులిచ్చారు. అప్పుడు కూడా సోషల్ మీడియా ఆయనపై మండిపడింది.

Google News