Anasuya: విజయ్ దేవరకొండపై అనసూయ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

Anasuya: విజయ్ దేవరకొండపై అనసూయ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

వివాదం ఎక్కడుంటే అనసూయ అక్కడుంటారనడంలో సందేహం లేదు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అంటే మాత్రం అంతెత్తున లేస్తుంది. వీరిద్దరి మధ్య వివాదం అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది అప్పటి నుంచి రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఆ తరువాత లైగర్ సినిమా విషయంలోనూ అనసూయ(Anasuya) కర్మ ఫలితం అంటూ ట్వీట్ చేసి రౌడీ హీరో ఫ్యాన్స్‌కు మరింత టార్గెట్ అయ్యింది.

తాజాగా మరోసారి విజయ్‌దేవరకొండ(Vijay Deverakonda)ను ఉద్దేశిస్తూ.. పరోక్షంగా పోస్ట్ పెట్టింది అనసూయ. అసలేం జరిగిందంటే.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నామని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్‌ చేసింది. అయితే ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది విజయ్ దేవరకొండ’ అని పేర్కొన్నారు. యూనిక్ పదాలకు ముందు మాత్రమే ది వాడతారు.

అలాంటిది విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పేరుకు ముందు వాడటం చాలా మందితో పాటే అనసూయకు కూడా నచ్చలేదు. దీంతో తాజాగా అనసూయ(Anasuya).. ‘‘ఏంటి ది(The) నా.. ఏం చేస్తాం.. పైత్యం.. అంటకుండా చూసుకుందాం’’ అని ట్వీట్ చేసింది.

నిజానికి స్టార్ హీరోలెవరూ కూడా ది అనే పదాన్ని తమ పేరు ముందు పెట్టుకోరు. అలాంటిది నాలుగు సినిమాలు పైగా వాటిలో కొన్ని డిజాస్టర్స్ ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ది అని పెట్టుకోవడమేంటని నెటిజన్లు సైతం విమర్శిస్తున్నారు.

Google News