Koratala Siva: ఆచార్య జ్ఞాపకాల నుంచి బయటకు రావాలనుకుంటున్న కొరటాల శివ.. వదలని మెగా ఫ్యాన్స్
ఒక సినిమా సక్సెస్ లేదంటే ఫెయిల్యూర్‌కు హీరో, దర్శకుడిలో ఎవరో ఒకరు కారణమవుతారు. ఒక్కోసారి ఇద్దరూ కూడా కారణం కావొచ్చు. అయితే దాదాపుగా సినిమా పోయిందంటే మాత్రం దర్శకుడిపైనే ఆ భారం అంతా పడిపోతుంది. సక్సెస్ వచ్చినప్పుడు కంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు టార్గెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.
గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ డిజాస్టర్ భారాన్ని మొత్తం దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)పైనే పడింది. ఆయన కెరీర్‌లోనే తొలి ఫ్లాఫ్ ఇదే కావడం గమనార్హం. నిజానికి ఈ కథలో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి చాలా మార్పులు చేర్పులు చేశారని.. ఆ కారణంగానే సినిమా డిజాస్టర్ అయ్యిందనే టాక్ కూడా నడిచింది. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం కొరటాలను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
ఆచార్య సినిమా ఫ్లాప్ కి పూర్తి బాధ్యత కొరటాల శివ(Koratala Siva)దే అంటూ మెగా కాంపౌండ్ నుంచి కామెంట్స్ వచ్చాయి. దీంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున పదేపదే కొరటాల శివని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ విమర్శలు ఏదో ఒక సందర్భంలో రిపీట్ అవుతూనే ఉన్నాయట.
అవి ఆచార్య జ్ఞాపకాల నుంచి బయటకు రావాలనుకుంటున్న కొరటాల శివ(Koratala Siva)కు అవరోధంగా మారుతున్నాయట. ప్రస్తుతం తన ఆశలన్నీ ఎన్టీఆర్ 30(NTR30)పైనే పెట్టుకున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతోంది.