Sreeleela: వామ్మో శ్రీలీల.. హవా ఇలాగే ఉంటే రూ.4కోట్లు రెమ్యూనరేషన్..

Sreeleela: వామ్మో శ్రీలీల.. హవా ఇలాగే ఉంటే రూ.4కోట్లు రెమ్యూనరేషన్..

రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడి(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల(Sreeleela). అమ్మడు నక్క తోక తొక్కి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో ఏమో కానీ.. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ సరసన చైర్ వేసుకుని కూర్చొనేందుకు పెద్దగా సమయం పట్టలేదు. తొలి సినిమా పెళ్లి సందడి డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరో హీరోయిన్ అయితే అడ్రస్ లేకుండా పోయేది. కానీ శ్రీలీల(Sreeleela) మాత్రం గట్టిగానే అదృష్టం చేసుకున్నట్టుంది. అమ్మడికి వరుస సినిమాలు క్యూ కట్టాయి.

పెళ్లి సందడి(Pelli Sandadi) తరువాత వచ్చిన రెండు సినిమాలు మాంచి హిట్ అవడంతో ఇక అమ్మడి రేంజే మారిపోయింది. పెద్ద, యంగ్ హీరోలు అన్న తారతమ్యం లేకుండా శ్రీలీలే(Sreeleela) తమ సినిమాలో హీరోయిన్‌గా కావాలని కోరుతున్నారట. అందంతో పాటు డ్యాన్స్ ఇరగదీస్తుందీ ముద్దుగుమ్మ. అదీ చాలదన్నట్టు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడదు. ఇంతకన్నా ఏం కావాలి? ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు? ప్రస్తుతం శ్రీ లీల టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ క్రేజీ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.

Sreeleela: వామ్మో శ్రీలీల.. హవా ఇలాగే ఉంటే రూ.4కోట్లు రెమ్యూనరేషన్..

స్టార్ హీరోలంతా తమ సినిమాల్లో శ్రీలీలే(Sreeleela) హీరోయిన్‌గా కావాలంటున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్‌ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. అంతే కాకుండా పలువురు యంగ్ హీరోలతో కూడా ఈమె నటిస్తోంది.

ఇక ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే అమ్మడి రెమ్యూరేషన్ కోట్లకు ఎగిసింది. రెండు కోట్లకు పైగా పారితోషికం దక్కించుకుంటున్న హీరోయిన్‌గా శ్రీ లీల(Sreeleela) రికార్డు సాధించింది. నిజానికి ఇంతటి రెమ్యూనరేషన్ కోసం చాలా కష్టపడాలి. అంత కష్టపడినా కూడా టైం తీసుకుంటుంది. కానీ శ్రీలీల(Sreeleela)కు మాత్రం ఎంతో సమయం పట్టలేదు. అమ్మడి క్రేజ్ ఇలాగే ఉంటే మరి కొద్ది రోజుల్లో రూ.4 కోట్లు అందుకోవడం ఖాయమట.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!