NTR: మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్న యంగ్ టైగర్..!

NTR: మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్న యంగ్ టైగర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) బుల్లితెరపై కనిపిస్తే ఆ సందడే వేరు కదా. వెండితెరను ఏలుతున్న తారక్ బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పిల్లాడిలా మారిపోయి అల్లరి చేస్తారు. అలాగే బెత్తం పట్టుకున్న టీచర్‌గా మారిపోయి క్లాస్ పీకుతారు. ఒకే సమయంలో ఆయనలోని విభిన్న కోణాలను చూడగలం. వెండి తెరపై ఏ స్థాయిలో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడో బుల్లి తెరపై కూడా అదే స్థాయిలో సక్సెస్‌ని సాధించడమనేది కొందరికే సాధ్యం. వారిలో ఎన్టీఆర్ ముందుంటాడు.

తెలుగు బిగ్ బాస్(Bigg Boss Telugu) సీజన్ 1 కి హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌(NTR)ను ఇప్పటికే ప్రేక్షకులు మరచిపోలేరు. ఇప్పటి వరకూ హోస్ట్‌లు మారుతున్నా కూడా ఎన్టీఆర్ స్థానాన్ని, స్థాయిని మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు.

ఎన్టీఆర్(NTR) హోస్టింగ్‌లో వచ్చిన బిగ్‌బాస్ సీజన్ 1(Bigg Boss Telugu Season 1) బుల్లితెర చరిత్రలోనే అత్యధిక రేటింగ్‌ను సాధించింది. ఇక ఆ తరువాత ‘మీలో ఎవరు కోటీశ్వరులు’(Meelo Evaru Koteeswarulu) అనే షోతో ఎన్టీఆర్ సందడి చేశాడు. ఈ షో క్రెడిట్ కూడా మొత్తం తారక్‌కే చెందుతుంది.

ఇక తాజాగా మన యంగ్ టైగర్ గురించి మరో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. మరోసారి ఎన్టీఆర్(NTR) బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఓ ప్రముఖ ఛానల్ ఎన్టీఆర్‌తో చర్చలు జరిపిందని.. కాన్సెప్ట్ నచ్చడంతో ఓకే చెప్పేశాడని టాక్. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. ఏ ఛానల్.. షో ఏంటనే దానిపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయంలో అభిమానుల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!