Samantha: నాగచైతన్యతో ఎందుకు విడిపోయిందో ఇన్నాళ్లకు రివీల్ చేసిన సమంత

Samantha: నాగచైతన్యతో ఎందుకు విడిపోయిందో ఇన్నాళ్లకు రివీల్ చేసిన సమంత

యంగ్ హీరో నాగ‌చైత‌న్య(Naga Chaitanya) న‌టించిన లేటెస్ట్ మూవీ ‘క‌స్టడి’. త‌మిళ ద‌ర్శకుడు వెంక‌ట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా కస్టడీ రూపొందింది. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. తాజాగా నాగ చైతన్య ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలో స‌మంత‌(Samantha)పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశాడు.

సమంత(Samantha) చాలా మంచి వ్యక్తి అని.. తను జీవితంలో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్టు చైతు తెలిపాడు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగానే తమ మధ్య మనస్పర్ధలు తలెత్తాయని చైతు వెల్లడించాడు. తాము విడిపోయి రెండేళ్లవుతోందని.. న్యాయస్థానం తమకు విడాకులు మంజూరు చేసి కూడా ఏడాది కావొస్తోందని చైతు తెలిపాడు. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వాళ్లం ముందుకు సాగుతున్నట్టు వెల్లడించాడు. ఇక జీవితంలో అన్ని దశలనూ తాను గౌరవిస్తానని చైతు తెలిపాడు.

Samantha, Naga Chaitanya

తాజాగా నాగచైతన్య(Naga Chaitanya) వ్యాఖ్యలపై సమంత(Samantha) ఇన్‌డైరెక్టుగా స్పందించింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫోటోతో పాటు ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ను పోస్ట్ చేసింది. తామంతా ఒకటేనని.. అపనమ్మకాలు.. భయాలు మాత్రమే తమను వేరు చేశాయని తెలిపే నికోలా టెస్లా కోట్‌ని షేర్ చేసింది.

ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేవలం అపనమ్మకం, భయాల కారణంగానే చైతు, సామ్‌లు విడిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!