Samantha: సమంతకు గాయాలు.. ఐస్ క్యూబ్స్‌తో నయం చేసుకునేందుకు యత్నం..

Samantha: సమంతకు గాయాలు.. ఐస్ క్యూబ్స్‌తో నయం చేసుకునేందుకు యత్నం..

స్టార్ హీరోయిన్ సమంత చాలా కష్టపడి చేసిన సినిమా శాకుంతలం. కానీ ఈ సినిమా ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అసలు ఈ సినిమా ఫ్లాప్ భారాన్ని మొత్తం నెటిజన్లు ఆమె నెత్తినే వేశారు. అసలు ఈ సినిమాకు సమంతే పెద్ద మైనస్ అని తేల్చి చెప్పారు. కనీసం వాయిస్ ఓవర్ విషయంలో కూడా ఆమె జాగ్రత్తలు తీసుకోలేదని వాయిస్ అస్సలు సూట్ అవలేదంటూ విమర్శలు గుప్పించారు. అంత కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అవడం ఒకవైపు.. నెటిజన్ల మాటలు మరోవైపు అమ్మడిని పెద్ద దెబ్బే కొట్టాయి.

మొత్తానికి రూ.100 కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కనీసం పాతిక కోట్ల వసూళ్లు కూడా దక్కించుకోలేక పోయింది. మొత్తానికి ఈ సారి సినిమాకు మాత్రం తన కష్టాన్ని ప్రేక్షకులకు చూపించాలనకుందో ఏమో కానీ రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం సమంత హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. వీటిలో నటించడం వల్ల సమంత బాగా కష్టపడి గాయాల పాలవుతుంది.

Samantha Ruth Prabhu

తన కష్టాన్ని ఎప్పటికప్పుడు సామ్ ప్రేక్షకులతో పంచుకుంటోంది. ఆ మధ్య చేతికి అయిన గాయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

తాజాగా తన ఒంటిపై అయిన గాయాలను ఐస్ క్యూబ్స్‌తో కూల్ చేసుకుంటోంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిత్రీకరణ సమయంలో టార్చర్ భరించడం కష్టంగా ఉందని సామ్ చెబుతోంది. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు సమంత లాంటి ఒక అందమైన హీరోయిన్ చేసే స్టంట్స్‌ ఇవి కావంటూ దర్శకుడికి సూచిస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!