కథను విస్మరించి కండలపై దృష్టి పెడుతున్న హీరోలు

Akhil Vijay Deverakonda 1

ఈ మధ్య సిక్స్ ప్యాక్ ఉంటే చాలు స్క్రిప్ట్‌ను అంగీకరించేస్తున్నారు హీరోలు. ఇక అంతే.. ఫిజిక్‌పై తెగ దృష్టి పెట్టి పెడుతున్నారు. మరి కథ మాటేంటి? సిక్స్ ప్యాక్‌పై ఫోకస్ పెట్టి కథను విస్మరించిన వారిలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు అక్కినేని అఖిల్. కానీ అంతకు ముందు చాలా మంది హీరోలు అలా దెబ్బతిన్న వారే.

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఏజెంట్(Agent) సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నానా తిప్పలు పడి సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. అఖిల్ ఈ సినిమా కోసం ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే వావ్ అనిపిస్తుంది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్.

కొద్ది రోజుల క్రితం వచ్చిన లైగర్‌దీ అదే పరిస్థితి. ఈ సినిమా కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తెగ కష్టపడ్డాడు. మాంచి ఫిజిక్ సంపాదించాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ ఏం లాభం పేలవమైన స్క్రిప్ట్ సినిమాను ముంచేసింది. జగన్నాధ్(Puri Jagannadh) ఎప్పట్లానే స్క్రిప్ట్ ను పైపైన రాసుకున్నాడు. దీంతో సినిమా కోసం విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. స్క్రిప్ట్ చూసుకోకుండా సినిమా చేస్తే బొక్క బోర్లా పడతామనేదానికి ఇదో ఉదాహరణగా నిలిచింది.

కేవలం అఖిల్(Akhil), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మాత్రమే కాదు.. అంతకు ముందు ఇలా మిస్ ఫైర్ అయిన సిక్స్ ప్యాక్ ప్రయోగాలు చాలా ఉన్నాయి.

సందీప్ కిషన్(Sandeep Kishan) వచ్చేసి మైఖేల్ అనే సినిమా చేసి ఇలాగే దెబ్బ తిన్నాడు. చివరకు మెగా హీరో వరుణ్ తే(Varun Tej)జ్ కూడా సిక్స్ ప్యాక్‌తో అదరగొడదామనుకుని గని మూవీ చేశాడు. అది కాస్తా డిజాస్టర్ అయిపోయింది. నాగార్జున, సునీల్, నితిన్, నాగశౌర్య తదితర హీరోలంతా సిక్స్ ప్యాక్ మోజుతో సినిమా చేసి బొక్క బోర్లా పడిన వారిలో ఉన్నారు.

Google News