అనుష్కకు అరుదైన సమస్య.. చాలా ఇబ్బంది పడుతోందట..

అనుష్కకు అరుదైన సమస్య.. చాలా ఇబ్బంది పడుతోందట..

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అనుష్క ఒకరు. టాలీవుడ్‌లో అయితే ఓ వెలుగు వెలిగింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను సైతం చేసింది. అరుంధతి సినిమా ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది.

అయితే ఈ సినిమా నటిస్తున్న సమయంలోనే సైజ్ జీరో మూవీలో నటించి తన కెరీర్‌కు తనే బ్రేకులు వేసుకుంది. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసమని బాగా లావైపోయింది అనుష్క. ఆ తరువాత తగ్గడానికి చాలా సమయం తీసుకుంది. దీంతో అవకాశాలన్నీ సన్నగిల్లాయి. ఇక ఇప్పుడు ఏదో చేస్తోందంటే..చేస్తోందంతే. ఇటీవలే నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి సినిమాలో నటించి మెప్పించింది.

అయితే అనుష్క ఓ అరుదైన సమస్యతో బాధపడుతోందని టాక్. అది పెద్ద సమస్య అయితే ఏమీ కాదు కానీ.. దాని వల్ల చాలా ఇబ్బందిపడిందట. ఇంతకీ ఆ సమస్య ఏంటంటారా? ఈ ముద్దగుమ్మ నవ్వడం మొదలు పెట్టిందంటే వెంటనే ఆపదట. నవ్వుతూనే ఉంటుందట. ఎవరైనా జోక్ చేస్తే చాలు చాలా సేపు కడుపుబ్బేలా నవ్వుతుందట. దాని వల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిపడ్డానని అనుష్క తెలిపింది. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం బ్రేక్ తీసుకుంటుందని సరదాగా వెల్లడించింది.