కల్కి తొలి రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందింది. ఈ సినిమాలో దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి పలువురు ప్రముఖ నటులు నటించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై అంచనాలేమో ఆకాశంలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇంతలోనే తొలి రివ్యూ ఎవరిచ్చారు.. అంటారా? సెన్సార్ బోర్డ్ సభ్యులు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. 2 గంటల 58 నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రదర్శించబడనుంది. ఇక కల్కి సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.
ఈ సినిమాలోని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నాయని తెలిపారట. విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ కూడా ఓవర్‌గా లేకుండా.. సమపాళ్లలో ఉన్నాయట. అసలు ఆ విజువల్స్ చూసి సెన్సార్ మెంబర్సే ఆశ్చర్యపోయారని టాక్. హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారట. షో కంప్లీట్ అయ్యాక అందరూ నిలబడి చప్పట్లు కొట్టారట.