నేను ఆమెకు కొత్త వర్షన్.. అందుకే బాలీవుడ్‌లో ఆఫర్స్: తాప్సీ

నేను ఆమెకు కొత్త వర్షన్.. అందుకే బాలీవుడ్‌లో ఆఫర్స్: తాప్సీ

ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటించినా కూడా ఎందుకో స్టార్‌డమ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఒకవైపు బాలీవుడ్.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తోంది. టాలీవుడ్‌లో రవితేజ, మంచుమనోజ్, గోపిచంద్, ప్రభాస్​లాంటి హీరోల సరసన మెరిసింది. 

తెలుగులో చివరిసారిగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో కనిపించింది. ఇక ఆ తరువాత అమ్మడు తెలుగు తెరపై కనిపించలేదు. గతేడాది డంకీ, ధక్‌ ధక్‌ వంటి బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తరువాతి నుంచి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాల్లో బాగా బిజీగా మారింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

తనను నటి ప్రీతీ జింటాకు కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారని తెలిపింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఆఫర్స్‌ వస్తున్నాయని వెల్లడించింది. ఆమె ఎంత పాజిటివ్‌ ఎనర్జీతో ఉంటారో అందరికీ తెలుసని.. తాను బాలీవుడ్‌లో ఉండేందుకు కారణమైన ప్రీతీకి ఎప్పుడూ చెడ్డపేరు తీసుకురానని తాప్సి తెలిపింది. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తానని వెల్లడించింది. ప్రీతిని తాను కేవలం బిగ్‌ స్క్రీన్‌పైనే చూశానని తెలిపింది. ఇటీవలే తాప్సీ తన ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.