విడుదలకు ముందే కల్కి సరికొత్త రికార్డ్..

విడుదలకు ముందే కల్కి సరికొత్త రికార్డ్..

డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి’ సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఆశించిన రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలు అయితే చిత్ర యూనిట్ నిర్వహించడం లేదు. తాజాగా ‘భైరవ ఏంథమ్’ పేరుతో ఓ పాట రిలీజ్ చేశారు. అటు ప్రమోషన్స్ సరిగా లేవని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు ఇదైనా ఊరటనిస్తుందనుకుంటే ఇది కూడా గోవిందా.

పంజాబీ ఫ్లేవర్ ఎక్కువవడంతో తెలుగు జనాలకు సరిగా రుచించలేదు. మొత్తానికి ఈ సినిమా ఇలా ఏదో ఒక అంశంలో హాట్ టాపిక్ అవుతుండగానే కల్కి ఖాతాలో సరికొత్త రికార్డ్ వచ్చి చేరింది. ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం రికార్డ్ నమోదు చేసింది. ఈ సినిమా కేవలం ఉత్తర అమెరికాలోనే 2 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిపోయింది. 

ఈ రేంజ్ బిజినెస్ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత జరిగితే పెద్ద విషయమేమీ కాదు కానీ రిలీజ్‌కి ముందు ఈ రేంజ్‌లో బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Google News