చిరంజీవి మాజీ అల్లుడు గుండెపోటుతో మృతి

చిరంజీవి మాజీ అల్లుడు గుండెపోటుతో మృతి

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ నేడు మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శిరీష్.. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి.. ఆర్య సమాజ్‌లో శిరీష్ వివాహం చేసుకొన్నాడు. అప్పట్లో వీరిద్దరి వివాహం సంచలనంగా మారింది. ఆ తర్వాత వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వీరి పెళ్లి ఎంత సంచలనమో.. వీరి విడాకులు సైతం అంతే సంచలనంగా మారాయి. 2014లో శిరీష్, శ్రీజ విడాకులు తీసుకుని వేరై పోయారు. అయితే పాప మాత్రం శ్రీజ వద్దనే పెరుగుతోంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ని శ్రీజ 2016లో వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఒక పాప పుట్టిన అనంతరం ఇద్దరూ విడిపోయారు.

చిరంజీవి మాజీ అల్లుడు గుండెపోటుతో మృతి

ఈ పాప కూడా శ్రీజ దగ్గరే పెరుగుతుంది. అయితే శిరీష్ ఆ తరవాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీలో  చేరి కొంతకాలం పాటు యాక్టివ్‌గా పని చేశారు. అనంతరం 2019లో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. లంగ్స్ డామేజ్ కావడంతో ఇటీవలే శిరీష్ ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన గుండెపోటుతో మరణించారని కూడా ఓ టాక్ నడుస్తోంది.

Google News