ఎవ్వరి గురించి ఆలోచించను.. విడాకులు ఇచ్చేస్తా: సదా

ఎవ్వరి గురించి ఆలోచించను.. విడాకులు ఇచ్చేస్తా: సదా

సీనియర్ హీరోయిన్ సదా.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. 2002 లో తేజ  దర్శకత్వంలో నితిన్ హీరోగా  వచ్చిన జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో సదాను చూసిన వారంతా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందనుకున్నారు. కానీ పెద్దగా సినిమాలేమీ చేయలేదు. అవకాశాలు రాలేదో మరో కారణమో కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు దూరమైంది. 

ఆ తరువాత తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు ముప్పై సినిమాల దాకా చేసింది. వాటిలో విజయం సాధించిన సినిమా రెండో మూడో మాత్రమే. ఆ తరువాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం డ్యాన్స్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా సదా పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. తాజాగా ఇంటర్వ్యూలో సదా మాట్లాడుతూ.. పెళ్లి విషయమై పూర్తి క్లారిటీ ఇచ్చింది.

ఎవ్వరి గురించి ఆలోచించను.. విడాకులు ఇచ్చేస్తా: సదా

ప్రస్తుతం తాను చాలా  స్వేచ్ఛగా ఉన్నానని… పెళ్లి చేసుకుని ఆ స్వేచ్చని దూరం చేసుకోలేనని వెల్లడించింది. వాస్తవానికి  పెళ్లి పై తనకు చాలా  గౌరవం ఉందని తెలిపింది. అయితే ఇప్పటి వరకూ తన హృదయానికి ఎవరూ దగ్గర కాలేదని తెలిపింది. . నచ్చిన వ్యక్తి కనపడితే  అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపింది. అయితే తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. పెళ్లి తర్వాత భర్తను భరించడం కష్టమనిపిస్తే ఎవరి గురించి ఆలోచించక విడాకకులు ఇచ్చేస్తానని సదా తెలిపింది. సదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.