పుష్ప-2 వాయిదా వెనుక.. సుకుమార్ ఒకలా.. బన్నీ మరోలా.. ఎవరికి వారే తగ్గేదే లే..

పుష్ప-2 వాయిదా వెనుక.. సుకుమార్ ఒకలా.. బన్నీ మరోలా.. ఎవరికి వారే తగ్గేదే లే..

‘పుష్ప-2’ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆగస్ట్ 15కు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో తెలిపింది. అయితే అలా విడుదల చేయడం కష్టమేనని భావించి పోస్టుపోన్ చేసింది. వాస్తవానికి ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టి ఉండాలి. కానీ షూటింగే అవలేదు. ఇంకా 50 రోజుల షూటింగ్ ఉందని టాక్. దీంతో సుకుమార్ మూడు యూనిట్లుగా తన చిత్రబృందాన్ని విడదీశారట. రెండు యూనిట్లు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో, మరో యూనిట్ మారేడుమిల్లిలో షూట్ చేస్తున్నారట.

ఇలా చేసినా కూడా కష్టమేనని సుక్కు భావించారట. పైగా ఇంత ఉరుకులు, పరుగులు పెట్టి చేస్తే అవుట్ పుట్ దెబ్బతింటుందన్న భావనలో ఉన్నారట. కాబట్టి హడావుడిగా ఆగస్ట్ 15 నాటికి విడుదల వద్దని అన్నారట. ఈ విషయాన్ని నేరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి చెప్పలేక నిర్మాతలు మైత్రి మేకర్స్ ని చెప్పమని అడిగారని సమాచారం. రిలీజ్ డేట్ విషయాన్ని మరిచి కూల్‌గా పని చేస్తేనే ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతామని సుక్కు భావనగా తెలుస్తోంది.

బన్నీ మాత్రం తగ్గేదేలే అంటున్నాడట. ప్రస్తుతం సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమయంలో సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేస్తే తిరిగి అంత హైప్ వస్తుందో లేదోనని భయపడి సినిమా విడుదల తేదీని మార్చే ప్రసక్తే లేదని పట్టుబట్టాడట. సుక్కుపై ఎంత అభిమానం ఉన్నా కూడా బన్నీ మాత్రం ఈ విషయంలో తగ్గలేదట. చివరికి ఎలాగోలా ఒప్పించి మొత్తానికి సినిమాని పోస్టుపోన్ చేయించి.. డిసెంబర్ 6న రిలీజ్ కు ప్లాన్ చేశారట.