ఎన్టీఆర్‌ను విజయ్ సేతుపతితో పోల్చుతూ నెట్టింట రచ్చ

ఎన్టీఆర్‌ను విజయ్ సేతుపతితో పోల్చుతూ నెట్టింట రచ్చ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని తమిళ్ స్టార్ విజయ్ సేతుపతితో పోల్చి నానా రచ్చ చేస్తున్నారు. దీనికి కారణమేంటంటే.. వీరు నటిస్తున్న సినిమాల సంఖ్యలో వ్యత్యాసం. ఎన్టీఆర్ గత ఆరేళ్లలో ఒక్క సినిమాను మాత్రమే విడుదల చేయగలిగాడు. 2018లో ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైంది. ఆ తరువాత నాలుగేళ్లకు అంటే 2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అయింది. ప్రస్తుతం ‘దేవర’ చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్‌. మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పైనే ఉన్నారు.

2018 తర్వాత ఎన్టీఆర్ ఒక్కటంటే ఒక్క సినిమానే విడుదల చేయగలిగాడు. ఇక విజయ్ సేతుపతిని తీసుకుంటే అదే ఆరేళ్లలో 25 సినిమాలు పూర్తి చేశాడు. 2018లో విజయ్‌ సేతుపతి 25వ సినిమా ‘సీతాకత్తి’ రిలీజ్‌ అయింది. అక్కడి నుంచి మొదలు ఇప్పటి వరకూ 25 సినిమాలు విడుదల చేశాడు. ఇటీవల విజయ్ నటించిన 50వ సినిమా ‘మహరాజ’ రిలీజ్‌ అయింది. ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌ను అందుకుంది. విజయ్‌కు క్యారెక్టర్ నచ్చాలే కానీ విలనా? హీరోనా?   చిన్న క్యారెక్టరా, పెద్ద క్యారెక్టరా? అనేది పట్టించుకోడు.

వాస్తవానికి ఎన్టీఆర్‌ను విజయ్‌తో కంపేర్ చేయకూడదు. ఎందుకంతే ఇద్దరి విషయంలో స్టార్ డమ్ వ్యత్యాసం చాలా ఉంది. ఎన్టీఆర్ హీరోగా తప్ప మరో క్యారెక్టర్ చేయడు. దీంతో ఈ రచ్చపై మిశ్రమ స్పందన వస్తోంది. విజయ్‌ సేతుపతితో ఎన్టీఆర్‌ని కంపేర్‌ చెయ్యడమేంటి అని కొందరు అంటుంటే.. విజయ్ సేతుపతికి ఏం తక్కువ? ఏ క్యారెక్టర్ అయినా ఇరగదీస్తాడు. ఈ విషయంలో ఎన్టీఆర్‌కు తీసిపోడని కొందరు అంటున్నారు.