ప్రభాస్ గురించి మంచు విష్ణు అలా అనేశాడేంటి?

ప్రభాస్ గురించి మంచు విష్ణు అలా అనేశాడేంటి? 

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్పపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీనికి కారణం స్టార్ తారాగణం ఈ ప్రాజెక్టులో పాల్గొనడమే. తాజాగా ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఫాంటసీ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్‌ పోషిస్తున్నాడు. సీనియర్ నటుడు మోహన్‌బాబు ఈసినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రభాస్, నయనతార ఈ సినిమాలో నటిస్తున్నారంటూ టాక్ రావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ మూవీలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తుండగా విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా మంచు విష్ణు పేల్చిన బాంబ్‌తో ప్రభాస్ రోల్ ప్రశ్నార్థకంగా మారింది. విష్ణు ఏమన్నాడంటే.. ప్రభాస్‌తో తనకు ఎలాంటి కాంబినేషన్ సీన్స్‌ లేవని తెలిపాడు. కన్నప్పకు శివుడితో కాంబినేషన్ సీన్స్ లేకపోవడమేంటి? అయితే ప్రభాస్ శివుడి పాత్ర పోషించడం లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మిగిలిన అందరి స్టార్స్‌ కాంబినేషన్‌లో ప్రభాస్‌ కనిపిస్తారని మంచు విష్ణు తెలిపాడు. టీజర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందంటూ కామెంట్స్ వినవస్తున్నాయి.