Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటానంటూ గతంలో ఓ సందర్భంలో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పార్టీ ఇంత సంక్షోభంలో ఉన్నా కూడా కనీసం స్పందించలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. పార్టీ అధినాయకత్వం అయితే తారక్ గురించి లైట్ తీసుకుంది కానీ మీడియాతో పాటు పార్టీ కార్యకర్తలు మాత్రం ఊరుకోవడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ మీడియా ఆరాలు తీస్తే.. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇంతకు మించిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మీడియా ఎన్టీఆర్ విషయమై ప్రశ్నించింది.

నిజానికి సినిమాల్లో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఎంతలా అయితే బాలయ్య అలరిస్తారో నిజం జీవితంలోనూ ఏదైనా విషయంపై మాట్లాడాల్సి వస్తే అంతే ఘాటుగా రెస్పాండ్ అవుతుంటారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన నాటి నుంచి ఏపీ వ్యవహారాలన్నీ దాదాపు ఆయనే చూసుకుంటుున్నారు.

మరోవైప తెలంగాణలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాలకృష్ణ టీడీపీ కార్యకర్తలతో ఒక మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై బాలయ్య మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకున్నా లేకపోతే సినిమా జనాలు రియాక్ట్ కాకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య ఇచ్చి పడేశారు.

మొత్తానికి ఎన్టీఆర్‌తో పని లేదని బాలయ్య నేరుగానే చెప్పేశారు. వస్తే ఎంత.. రాకుంటే ఎంత? అన్నట్టుగా… మొత్తానికి ఎన్టీఆర్ అవసరం తమ పార్టీకి లేదని బాలయ్య తేల్చేసినట్టే అని కార్యకర్తలు అనుకుంటున్నారు.

Google News