Chiranjeevi: చిరంజీవిని చెడగొడుతున్న ఆ వ్యక్తి ఎవరు?

Chiranjeevi: చిరంజీవిని చెడగొడుతున్న ఆ వ్యక్తి ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి దాదాపుగా ప్రతి ఒక్కరూ గొప్పగానే చెబుతుంటారు. తాజాగా ఆయన గురించి సీనియర్ హీరో భాను చందర్(Bhanu Chander) కూడా చాలా గొప్పగా చెప్పారు. అయితే ఓ మాట్లాడిన మాటల్లో ఒకటి మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

తొలుత చిరంజీవి(Chiranjeevi) సైతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత హీరోగా మారి తన డ్యాన్స్, ఫైట్స్, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని స్టార్ హీరోగా ఆపై ఇండస్ట్రీని శాసించే స్థాయికి మెగాస్టార్ ఎదిగారు.

మెగాస్టార్‌కు అప్పట్లో సుమన్‌(Suman)తో పాటు సీనియర్ హీరో భాను చందర్(Bhanu Chander) కూడా స్నేహితుడే. అప్పట్లో కృష్ణంరాజు(Krishnam Raju) హీరోగా నటించిన ‘మనవూరి పాండవులు’ అనే చిత్రంలో చిరంజీవి, భాను చందర్ కలిసి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో తనకి ఏర్పడిన స్నేహం గురించి భానుచందర్(Bhanu Chander) తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. భానుచందర్ మాట్లాడుతూ మనవూరి పాండవులు(Mana Oori Pandavulu) సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి(Chiranjeevi), తాను రూమ్ మేట్స్‌గా ఉండేవాళ్ళమని తెలిపారు.

Bhanu Chander about Chiranjeevi

అప్పట్లో తామిద్దరి మధ్య రా అని పిలుచుకునేంత మంచి స్నేహం ఉండేదన్నారు. తనకు దగ్గరుండి మరీ చిరు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌ని నేర్పించారని భానుచందర్(Bhanu Chander) చెప్పుకొచ్చారు. చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని కానీ అందరి వెనుకా ఒకరున్నా.. ఆయన వెనుక కూడా ఒకరున్నారని.. ఆయన చెప్పుడు మాటలను చిరు వినడం మానేస్తే మంచిదని భానుచందర్(Bhanu Chander) హితవు పలికారు.

ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? అతని వల్ల చిరుకి జరుగుతున్న నష్టమేంటనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Google News