Actress Shalini: నాలుగేళ్లు టార్చర్ అనుభవించా.. విడాకుల వేడుకపై నటి చెప్పిన షాకింగ్ విషయాలు..

Actress Shalini: నాలుగేళ్లు టార్చర్ అనుభవించా.. విడాకుల వేడుకపై నటి చెప్పిన షాకింగ్ విషయాలు..

ప్రముఖ తమిళ నటి షాలిని(Actress Shalini) విడాకుల ఫొటో షూట్‌‌పై సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం పెద్ద ఎత్తున ఫోటో షూట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది కాస్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. నిజానికి ఆమె ఎందుకు అలా చేసిందన్న విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ముందుగా విస్తుబోవడం ప్రతి ఒక్కరి వంతైంది.

ఇక తాను ఎందుకు అలాంటి ఫోటో షూట్ చేయాల్సి (Shalini Photoshoot)వచ్చిందో తాజాగా షాలిని పంచుకున్నారు. నాలుగేళ్ల పాటు ఆమె తన భర్త కారణంగా నరక యాతన అనుభవించిందట. తాను దుబాయ్‌లో భర్తతో కలిసి ఉండేదాన్నని.. తన భర్త తనను విపరీతంగా కొట్టేవాడని తెలిపింది. అలా కొట్టినప్పుడు తాను వెళ్లి పార్కింగ్‌లో పడుకునేదాన్నని వెల్లడించింది. అంతకు మించి గొడవను ఎలా ఆపాలో తెలియలేదని పేర్కొంది. పోలీసుల దగ్గరకు వెళితే అతని జీవితం నాశనమవుతుందని అడ్జెస్ట్ అయ్యేదానన్ని తెలిపింది.

Tamil TV actress Shalini Photoshoot

ఒక రోజు తన పిల్లల ముందే తనను తన భర్త విపరీతంగా కొట్టాడని తెలిపింది. ఏ పిల్లల కోసమైతే నాలుగేళ్ల పాటు మర్యాద ఇస్తూ వచ్చిందో అదే పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా తనను కొట్టడంతో పట్టరాని కోపం వచ్చేసిందని వివరించింది. దీంతో తాను తిరిగి అతడిని కొట్టానని వెల్లడించింది. ఆ రోజు తనను ఇంటి నుంచి తన భర్త వెళ్లిపొమ్మన్నాడని తాను కుదరదని చెప్పేశానని తెలిపింది. గతంలో అయితే సింగిల్ కాబట్టి వెళ్లమనగానే సూట్‌కేసు పట్టుకుని వెళ్లిపోయేదాన్నని కానీ ఇప్పుడు కుదరదని చెప్పానని షాలిని వెల్లడించింది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!