గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. తన సోదరుడు సంపత్‌తో సహా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యూట్యూబ్‌తో ఫేమస్ అయిన షన్నుని బిగ్ బాస్ షో మరింత పాపులర్ చేసింది. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతనికి మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. నెట్టింట చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇక బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు.. అలాగే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా పాపులర్ అయ్యాడు.

బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే షణ్ముఖ్ జశ్వంత్‌కి అతని ప్రియురాలు దీప్తి సునయన అతనికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో కొద్ది రోజుల పాటు వార్తలన్నీ వారిద్దరి చుట్టూనే తిరిగాయి. ఇక తాజాగా డ్రగ్స్‌తో బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. అసలేం జరిగిందంటే.. మౌనిక అనే యువతిని పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా షన్ను సోదరుడు సంపత్ వినయ్ మోసం చేస్తున్నాడు.

Advertisement
గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

మౌనికను చివరకు ఆరు రోజుల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అంతలోనే మరో యువతిని సంపత్ పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ కోసమని పోలీసులు అతని ఫ్లాట్‌కి వెళ్లారు. ఇల్లాంతా తనిఖీ చేయగా షన్ను గంజాయితో దొరికిపోయాడు. దీంతో పోలీసులు సంపత్‌తో పాటు షణ్ముఖ్ జశ్వంత్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు.