తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

హీరో నిఖిల్ సిద్దార్థ్ తన ఫ్యాన్స్‌కి సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పాడు. తను తండ్రి అయ్యానంటూ బిడ్డకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశాడు. 2020 లాక్‌డౌన్ సమయంలో నిఖిల్ వివాహం సింపుల్‌గా జరిగింది. పల్లవి అనే డాక్టర్‌ను నిఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు నాలుగేళ్ల తరువాత నిఖిల్, పల్లవి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు.

ఇక ఆ మధ్య కాలంలో నిఖిల్ దంపతులు విడిపోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దానిని నిఖిల్ పరోక్షంగా ఖండించాడు. కొన్ని నెలల క్రితం తాను తండ్రిని కాబోతున్నట్టుగా నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇటీవలే పల్లవికి ఘనంగా సీమంతం కూడా జరిగింది. ఇక తాజాగా పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

ఇక నిఖిల్ కెరీర్ విషయానికి వస్తే.. ఒక సక్సెస్. రెండు ఫ్లాప్స్ అన్నట్టుగా సాగుతోంది. కార్తికేయ 2 అయితే నిఖిల్‌కు మంచి హిట్‌ను తెచ్చి పెట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లను రాబట్టింది. అనంతరం వచ్చిన 18 పేజేస్ చిత్రం పర్వాలేదనిపించినా.. ఆ తరువాత వచ్చి స్పై మాత్రం ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ప్రస్తుతం స్వయంబు అనే సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.

Google News