Chiranjeevi: నాగబాబుకి క్లాస్.. నిహారిక విషయంలో స్వయంగా రంగంలోకి చిరు..

Chiranjeevi Nagababu

మెగా ఫ్యామిలీ (Mega Family) విషయానికి వస్తే కాస్త నోటి దురుసు విషయంలో నాగబాబే (Nagababu) ముందుంటారు. మిగిలిన వాళ్లంతా కూడా ప్రతి ఒక్క విషయంలోనూ ఆచి తూచి మాట్లాడతారు. అయితే ఇప్పుడు నాగబాబు (Nagababu) కూతురు నిహరిక (Niharika Konidela), అల్లుడు చైతన్య (Chaitanya)ల వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేనా? విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారని సైతం రచ్చ చేస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటి వరకూ విడిపోయిన అందరు జంటలకు మల్లే ఈ జంట కూడా ఒకరి ఇన్‌స్టాను మరొకరు ఫాలో అవ్వడం ఆపేశారు. నిహరిక (Niharika Konidela) అయితే తన ఇన్‌స్టాలో ఉన్న ఫోటోలను డిలీట్ చేయలేదు కానీ చైతన్య మాత్రం తన ఇన్‌స్టాలో నిహరిక (Niharika Konidela)తో ఉన్న ఫోటోలను మొత్తం డిలీట్ చేసేశాడు. ఇటీవలి కాలంలో నిహారిక (Niharika Konidela) ఓ పబ్‌లో దొరికిపోయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య అగ్గి రగులుతోందని టాక్.

Niharika Konidela, Chaitanya

అయితే ఆ మధ్య కాలంలో తన అల్లుడి గురించి తెగ పొగిడేసిన నాగబాబు (Nagababu)… ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. అయితే నాగబాబుకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్లాస్ పీకారట. ఇప్పటికే తన కూతురి జీవితం పాడైందని.. అలా మెగా ఫ్యామిలీలో మరో అమ్మాయి జీవితం అవకూడదని చిరు (Chiranjeevi)యే స్వయంగా రంగంలోకి దిగుతున్నారట. చైతన్య కుటుంబంతో స్వయంగా మాట్లాడి విషయాన్ని విడాకుల వరకూ వెళ్లనివ్వకుండా చూడాలనుకుంటున్నారట. చిరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇష్యూ సెటిల్ అయినట్టేనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Google News