Vijayashanthi: ‘రానా నాయుడు’పై విజయశాంతి ఫైర్
ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై ఆంక్షలేమీ ఉండవు. దీనినే దృష్టిలో పెట్టుకుని వెబ్ సిరీస్ తీసేవాళ్లు ఇష్టానుసారంగా బూతు కంటెంట్‌ను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో మనం పెద్దగా బూతు కంటెంట్‌ను చూడలేం. కానీ ఇటీవల వచ్చిన రానా నాయుడు (Rana Naidu) మాత్రం పక్కా అడల్ట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన కంటెంట్‌గానే పరిగణించాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ మనం రానా దగ్గుబాటి (Rana Daggubati)ని కానీ.. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) సినిమాల్లో కానీ వల్గారిటీ అనేది చూడలేదు.
రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్‌లో రానా (Rana), వెంకటేష్(Venkatesh) కలిసి నటించారు. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ ఇటీవలే విడుదలైంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. సింగిల్‌గా చూడాలని విడుదలకు ముందే వెంకీ (Venkatesh) ఎందుకు చెప్పారనేది ఈ వెబ్ సిరీస్ చూసిన మీదట కానీ జనాలకు అర్థం కాలేదు. యూత్‌కి పర్వాలేదనిపించినా కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి ఇది అస్సలు రుచించలేదు. దారుణమైన బూతులు, అడల్ట్ కంటెంట్‌తో ఈ సిరీస్ రూపొందింది.
తాజాగా రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్‌ని చూసిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanthi) దీనిపై ఫైర్ అయ్యారు. గత కొంత కాలంగా ఓటీటీ కంటెంట్‌కు సైతం సెన్సార్ ఉండాలని ఉద్యమం చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకుని అడల్ట్ కంటెంట్ సినిమాలు,మహిళలు పూర్తిగా వ్యతిరేకించే సినిమాలు చెయ్యడం మానుకోవాలని హితవు పలికారు. ఓటీటీ కంటెంట్‌కు సంబంధించి మహిళల ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ఇప్పటికే అప్‌లోడ చేసిన అడల్ట్ కంటెంట్ సినిమాలను తొలగించాలని రాములమ్మ (Vijayashanthi) హితవు పలికారు.