Niharika Konidela: నిహారిక కొణిదెల, చైతన్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారట.. కారణం ఏంటంటే

niharika konidela and chaitanya went to court for divorce

సినిమా వాళ్ల పెళ్లిళ్లు అంటేనే అయితే మూణ్ణాళ్ల ముచ్చట లేదంటే.. లైఫ్ లాంగ్ జర్నీలా ఉంటుంది. ఇప్పుడు ఇదెందుకు అంటే.. ఇటీవలి కాలంలో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ముద్దుల కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela) – చైతన్య (Chaitanya)ల వివాహం మూణ్ణాళ్ల ముచ్చట మాదిరిగానే నిలవబోతోందని టాక్. అమ్మడి పెళ్లి వేడుక చెప్పుకోదగ్గ అతి కొద్ది వివాహాల్లో ఒకటి. రాజస్థాన్‌లోని ఉదయగడ్ ప్యాలస్‌లో వీళ్లిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ (Mega Family) అంతా ఒక్కటై సందడి చేసింది. 

niharika konidela and chaitanya went to court for divorce

మెగా కుటుంబంలోని అనందం అంతా ఈ వివాహంలోనే కనిపిస్తుంది. అంత ఆనందంగా నిహారిక (Niharika Konidela) – చైతన్య (Chaitanya)ల జంటను ఒక్కటి చేస్తే.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే టాక్ బీభత్సంగా వినిపిస్తోంది. ఫ్యాన్స్‌కి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఇప్పటికే వీరిద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారట. అలాగే చైతన్య కూడా నిహారిక (Niharika Konidela)కు సంబంధించిన పిక్స్ అన్నింటినీ తొలగించాడట. విషయం అయితే బయటకు రాలేదు కానీ ఈ జంట గత కొంతకాలంగా విడివిడిగానే ఉంటూ వస్తోందట.

niharika konidela and chaitanya

అంతేకాదు.. నిహారిక (Niharika Konidela) – చైతన్య (Chaitanya)లు లేటెస్ట్‌గా కోర్టులో విడాకుల పిటిషన్‌ని సైతం దాఖలు చేశారట. గత ఏడాది నిహారిక కొణిదెల ఒక పబ్‌లో పోలీసుల రైడింగ్‌లో దొరికిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఈ న్యూస్ పెను సంచలనాన్నే సృష్టించింది. అప్పటి నుంచే ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయని టాక్. అసలే మెగా బ్రదర్ కూతురు కావడంతో నిహారిక (Niharika Konidela)కు కాస్త ఈగో ఎక్కువేనట. దీంతో మనస్పర్థలు మరింత ముదిరాయని సమాచారం. కారణం ఏదైతేనేమి విడాకులు వరకూ ఈ జంట వెళ్లిన విషయం మాత్రం పక్కా అని ఫిలింనగర్ టాక్.

Google News