Prabhas: ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ రచ్చ.. అసలు విషయం ఏంటంటే..!

Prabhas

సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంటుంది. ఏదో కొద్దిరోజుల పాటు స్టార్ హీరో ప్రభాస్(Prabhas) మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఏం చేసినా కూడా దానికి అనారోగ్యాన్ని జత చేసి వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ అనారోగ్యంపై తరచూ వార్తలు వినవస్తూ ఉండటంతో ఆయన ఫ్యాన్స్ (Prabhas fans) ఆందోళన చెందడం సర్వ సాధారణమైపోయింది. పైగా ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటానికి ఆయన చేసే వర్కౌట్లే కారణమంటూ ఓ ముక్తాయింపు.

అంతటితో ఆగారా? ప్రభాస్ (Prabhas) అనారోగ్యం కారణంగా.. ప్రాజెక్ట్ K (Project K)తో పాటు సలార్ షూటింగ్ కూడా వాయిదాపడే అవకాశం ఉందని.. సలార్(Salaar) రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందంటూ వార్తలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఇటీవలి కాలంలో ప్రభాస్ (Prabhas) ఇటలీ ఎక్కువగా వెళ్లి వస్తున్నాడు. దీంతో అసలు కారణం తెలుసుకోకుండా ప్రభాస్(Prabhas) హెల్త్ చెకప్ కోసమే ఇటలీ వెళుతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ ప్రారంభమైంది.

Prabhas2

నిజానికి ఆయన ఇటలీ (Italy) వెళుతున్నది షూటింగ్ కోసమట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా సలార్ (Salaar) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తి అయ్యిందని టాక్. కాగా.. ఓ షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్‌ ఇటలీ (Italy)లో జరుగుతోంది. దీని కోసమే ప్రభాస్ ఇటలీకి వెళుతున్నారు. మొత్తానికి ప్రభాస్ (Prabhas) సినిమా షూటింగ్ కోసమే ఇటలీ వెళ్లారనే క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ (Prabhas fans) కాస్త రిలాక్స్ అయ్యారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!