Dasara: ‘దసరా’ కు కరణ్ జోహార్ సాయం తీసుకోకపోవడం వెనుక..!
నాని(Nani) హీరోగా రూపొందిన దసరా(Dasara Movie) విడుదలకు సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీకి తెరదీయాలని ఉవ్విళ్లూరుతోంది. పాన్ ఇండియా మూవీగా దసరా(Dasara Movie) తెరకెక్కింది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. హీరో నాని(Nani) సైతం ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నానికి అయితే ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
ఈ క్రమంలోనే నాని హిందీలో దసరా(Dasara Movie)ను ప్రమోట్ చేస్తూ ముంబైలో సందడి చేస్తున్నాడు. ఇటీవల హోలీని సైతం అక్కడి జనం మధ్య నాని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా నానిని మీడియా హిందీ మార్కెట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఆశిస్తున్నారని అడగ్గా.. “బాహుబలి(Bahubali)తో రాజమౌళి(Rajamouli)కి వచ్చినంత బాలీవుడ్ మార్కెట్‌లు నాకు అవసరం లేదు. హిందీ మార్కెట్‌లో నాకు సహాయం చేయడానికి నేను ఎవ్వరినీ (కరణ్ జోహార్ Karan Johar) పిలవలేను. నా సామర్థ్యానికి తగ్గట్టుగా నేను నా స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాను.
దసరా(Dasara Movie)కు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా. కేవలం మౌత్ టాక్ నా సినిమాకు అద్భుతమైన ప్రచారం కల్పిస్తుందని భావిస్తున్నా. కాంతారావు (Kantharao) గొప్ప కంటెంట్ ఆధారంగా అదిరిపోయే హిట్ కొట్టారు. అలాగే దసరా(Dasara Movie)కి బాగా కనెక్ట్ అవుతారని.. ఈ చిత్రం హిందీలో నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల కోసం నా ఐడీ కార్డ్‌ని మారుస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రీ సేల్స్‌తో పాటు యూఎస్‌లో కూడా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబడుతుంది’’ అని పేర్కొన్నారు.