Ram Charan: ‘కొమురం భీముడో’ సాంగ్ క్రెడిట్ కూడా రామ్ చరణ్‌కేనట.
ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆస్కార్ (Oscar Award) గెలుచుకున్న అనంతరం ఈ సినిమా మరింత వార్తల్లో నిలుస్తోంది. సినిమాకు సంబంధించి ప్రతిదీ హైలైట్ అవుతోంది. ఇప్పుడిప్పుడే ఈ మూవీ ఇచ్చిన హ్యాపీనెస్ నుంచి కాస్త బయటకు వస్తూ సినిమా టీం మొత్తం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన తదుపరి చిత్రం శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో బిజీ అయిపోయాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. కొరటాల దర్శకత్వంలో చేయబోతున్న మూవీకి సన్నద్ధమవుతున్నాడు. ఇక రాజమౌళి (Rajamouli) సైతం సూపర్ స్టార్ (Superstar Mahesh Babu)తో సినిమా పనులు చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కొందరు మాత్రం ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ (Oscar Award) అవార్డుని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ (Prem Rakshith) ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ తర్వాత ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలో కొమురం భీముడో(Komaram Bheemudo) సాంగ్ హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ (NTR) పలికించిన హావభావాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కానీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ (Prem Rakshith Master) మాత్రం సాంగ్ క్రెడిట్‌ను చెర్రీ (Ram Charan)కి ఇచ్చేశారు. దీనికో లాజికల్ రీజన్ చెప్పారు. ఇష్టం లేని పనిని దేశం కోసం తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది చెర్రీ సరిగ్గా తన ఫేస్‌లో చూపించారని ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith) వెల్లడించారు. కళ్లలో నటనని పలికించడం కష్టమని.. అందుకే ఆ సాంగ్ క్రెడిట్‌ని రామ్ చరణ్ (Ram Charan)కి ఇస్తున్న ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు.