Dil Raju: స్టార్ హీరోల అభిమానులకు దిల్ రాజు గుడ్ న్యూస్..

Producer Dil Raju

ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) తనకంటూ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆయన ప్రస్థానం ప్రొడ్యూసర్ వరకూ ఎదిగారు. ఆయన సినిమా అంటే చాలు.. జనాలు ఎగబడే పరిస్థితికి ఎదిగారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan)తో శంకర్(Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా దిల్ రాజు టాలీవుడ్ స్టార్ స్టార్ హీరోల ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. తన కొత్త సినిమాలు ఏ ఏ స్టార్ హీరోలతో ప్రకటించారు.

ఒకవైపు ప్రస్తుతం తీస్తున్న సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు కొత్త సినిమాల నిర్మాణ పనుల్లో దిల్ రాజు(Dil Raju) బిజీగా ఉన్నారు. ఇక దిల్ రాజు కొత్త సినిమాలు ఏ ఏ స్టార్ హీరోలతోనంటే.. ప్రభాస్(Prabhas), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), పవన్ కల్యాణ్(Pawan Kalyan) మూవీలు ఉన్నట్లు సమాచారం. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రస్తుతం సలార్(Salaar) మూవీ రూపొందుతోంది. ఇదే కాంబోలో మరో సినిమా కూడా రాబోతోందని దానికి తానే నిర్మాతనని దిల్ రాజు వెల్లడించారు. అది పౌరాణికం నేపథ్యంలో ఉంటుందన్నారు.

ఇక ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(NTR30) అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇక పవన్ కల్యాణ్ వచ్చేసి హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) చిత్రం చేస్తున్నారు. ఇక ఈ స్టార్ హీరోలు తమ సినిమా షూటింగ్‌లను ముగించుకున్న వెంటనే దిల్ రాజుతో సినిమా చేయనున్నారు. ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు ఉంటాయని దిల్ రాజు(Dil Raju) ప్రకటించడంతో ఆ సినిమాలపై ఆసక్తికర చర్చ నెట్టింట మొదలైంది. ఈ సినిమాల్లో తమ హీరోలను దిల్ రాజు ఎలా చూపిస్తారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Google News