Surekha Vani: నువ్వు నాతో లేవన్న బాధే ఎక్కువగా ఆవేదనకు గురి చేస్తోంది: సురేఖా వాణి

Surekha Vani: నువ్వు నాతో లేవన్న బాధే ఎక్కువగా ఆవేదనకు గురి చేస్తోంది: సురేఖా వాణి

తెలుగు ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న వారిలో సురేఖా వాణి ఒకరు. 2005 సంవత్సరంలో శీనుగాడు చిత్రంతో సినీ కెరీర్ ఆరంభించింది. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది. ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాపై తన ఫోకస్ అంతా పెట్టింది.

ఇప్పుడు ఆమె సోషల్ మీడియా స్టార్. పొట్టిపొట్టి దుస్తులతో కూతురితో కలిసి ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. మరోవైపు తల్లీకూతుళ్లు గ్లామర్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ వైరల్ అయిపోతుంటారు.

తాజాగా సురేఖా వాణి భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బుల్లితెరపై దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన సురేష్ తేజని సురేఖా వాణి ప్రేమ వివాహం చేసుకుంది. భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమానికి శివాజీ రాజాతో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. 2019లో సురేష్ తేజ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కాగా.. తన భర్త పుట్టినరోజు సందర్భంగా సురేఖా వాణి భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘నా కళ్లలో ఆనందం, సంతోషం కన్నా.. నువు నా పక్కన లేవు అన్న బాధే నన్ను ఎక్కువగా ఆవేదనకు గురి చేస్తోంది. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ నాతోటే ఉంటాయని నాకు తెలుసు. నా ప్రతి పుట్టిన రోజుకి నువ్వు చేసే సందడి.. ఆ మధుర క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నిన్న చాలా మిస్ అవుతున్నా.. లవ్ యూ ఫర్ ఎవర్’ అంటూ పోస్ట్ పెట్టింది. దీనిని చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఎప్పుడూ సరదాగా.. హుషారుగా కనిపించే సురేఖా వాణి తన భర్తపై ఇంత ప్రేమను చూపిస్తుందా? అని అవాక్కవుతున్నారు.

Google News