Chinmayi: షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి: నెటిజన్‌పై చిన్మయి ఫైర్

Chinmayi: షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి: నెటిజన్‌పై చిన్మయి ఫైర్

సింగర్ చిన్మయి(Singer Chinmayi).. గాయనిగా కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. విషయం ఏదైనా సరే.. ఆమె చాలా బోల్డ్‌గా స్పందిస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఎంతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. గతంలో సమంత పాత్రలకు తన గాత్రంతో ప్రాణం పోశారు. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ఆమె చాలా బోల్డ్‌గా మాట్లాడేవారు.ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సమయంలో చిన్మయి చాలా హాట్ టాపిక్.

తాజాగా చిన్మయి(Singer Chinmayi) ఓ నెటిజన్‌పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. డ్రెస్‌ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని బాధపడిపోతూ ఒక యువకుడు వాళ్లు ఎలాగూ వేసుకోవడం లేదు కాబట్టి.. తాను వేసుకుని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై తనదైన శైలిలో చిన్మయి స్పందించారు.

చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ ఏంటో తెలుసుకోవాలని చిన్మయి(Singer Chinmayi) అన్నారు. గతంలో అసలు భారతీయ మహిళలకు జాకెట్ వేసుకునే కల్చరే లేదన్నారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి జాకెట్ కల్చర్ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పారు. అప్పట్లో ఆడవారికి జాకెట్ గురించి తెలియదని.. చీరను జాకెట్‌గా మడిచి ధరించేవారన్నారు. బ్రిటీషర్ల నుంచి లైంగిక వేధింపులు పెరగడంతో మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టారన్నారు. అలాగే మగవాళ్లు కేవలం పంచె మాత్రమే కట్టుకునే వారని గుర్తు చేశారు. చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోవాలని చిన్మయి సూచించారు. విజ్ఞానం పెంచుకోవాలని.. ప్రతిదాన్నీ కామంతో చూడొద్దని చిన్మయి(Singer Chinmayi) తెలిపారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!