NTR Wife: ఉపాసనకు ఎన్టీఆర్ భార్య ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

NTR Wife: ఉపాసనకు ఎన్టీఆర్ భార్య ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన (Upasana) తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు ఏడో నెల. ఉపాసనకు ఇటీవలే కుటుంబ సభ్యులు వైభవంగా సీమంతం నిర్వహించారు. ఇక అంతకు ముందు దుబాయ్‌లో కూడా ఒకసారి సీమంతం జరిగింది. తాజాగా మరోసారి జరిగింది. అయితే ఈసారి టాలీవుడ్ సెలబ్రిటీ కోసం ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi) ఉపాసనకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాకు ముందు నుంచే చెర్రీ, ఎన్టీఆర్ స్నేహితులు. ఇక ఈ సినిమాతో వారి స్నేహ బంధం మరింత బలపడింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాలు సైతం దగ్గరయ్యాయి. ఉపాసన, లక్ష్మీప్రణతి స్నేహితులుగా మారారు. ఇక తన స్నేహితురాలి కోసం లక్ష్మీ ప్రణతి.. రెండు రకాల స్పెషల్ స్వీట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారని టాక్. గర్భిణులకు బలవర్ధకమైన ఆహారమైన సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డూలను లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi) గిఫ్ట్‌గా ఇచ్చారట.

Ram Charan, Upasana

ఉపాసన వాటిని తిని చాలా హ్యాపీగా ఫీలయిన ఉపాసన అవి తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారట. ప్రస్తుతం లక్ష్మీప్రణతి(Lakshmi Pranathi) గిఫ్ట్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఉపాసనకు జులైలో డెలివరీ డేట్ ఇచ్చారట. అంతేకాదు.. పుట్టబోయే పిల్లల విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చెర్రీ దంపతులకు ఆడపిల్లే పుడుతుందని టాక్ నడుస్తోంది. ఇక ఉపాసన(Upasana) అపోలో ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోతోందని సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!