దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ నెల 30న మెగా ఫ్యామిలీ ఇంట పెద్ద ఎత్తున పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో జరగనున్న విషయం తెలిసిందే. ఇక విక్టరీ వెంకటేష్ ఇంట కూడా వివాహం జరగనుంది. వెంకీ కూతురు హయవాహిని ఎంగేజ్‌మెంట్ ఇప్పటికే పూర్తైంది.

ఇక తాజాగా దిల్ రాజు ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన సోదరుడు అయిన శిరీష్ కుమారుడు హీరో ఆశిష్ రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఆశిష్ రెడ్డి కూడా హీరోగా ఓ చిత్రంలో నటించాడు. రౌడీ బాయ్స్ సినిమాతో గత ఏడాది తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలియదు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘సెల్ఫిష్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

కొద్దిరోజుల క్రితం దిల్ రాజు తండ్రి మరణించారు. ఈ క్రమంలోనే విషాదం జరిగిన కుటుంబంలో శుభకార్యం జరిపితే మంచిదనే అభిప్రాయంతో ఆశిష్ పెళ్లి చేయాలనుకుంటున్నారని సమాచారం. త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహం జరపాలని ఇరువైపుల పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. పెళ్లి విషయంపై త్వరలోనే దిల్ రాజు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Google News