Dimple Hayathi: డీసీపీతో వివాదంతో.. వెలుగులోకి వచ్చిన డింపుల్ సీక్రెట్ వ్యవహారం

Dimple Hayathi: డీసీపీతో వివాదంతో.. వెలుగులోకి వచ్చిన డింపుల్ సీక్రెట్ వ్యవహారం

డింపుల్ హయాతీ(Dimple Hayathi) పేరు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ మారుమోగుతుంది. ఇప్పటి వరకూ పలు సినిమాల్లో నటించినా కూడా ఈ ముద్దుగుమ్మ పెద్దగా పాపులర్ కాలేదు కానీ ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేతో వివాదంతో తెగ పాపులర్ అయిపోయింది. పార్కింగ్ లో ఉన్న రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టడంతో పాటు డింపుల్(Dimple Hayathi) కాలితో తన్నారని ఆమెపై కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సైతం వైరల్ అవుతోంది.

ట్రాఫిక్ డీసీపీగా ఉన్న రాహుల్ హెగ్డే(Rahul Hegde) తన అధికారాన్ని ఉపయోగించి తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని డింపుల్ హయతి ఆరోపిస్తోంది. పలు మార్లు చెప్పి చూశానని అయినా కూడా డింపుల్ తన తీరు మార్చుకోలేదని రాహుల్ హెగ్డే చెబుతున్నారు. డింపుల్ కారుపై సైతం చలాన్లు బీభత్సంగానే ఉన్నాయి. వాటిని ఆమె మీడియాలో వార్త వచ్చిన క్షణాల్లోనే క్లియర్ చేసేసింది. కాగా.. ప్రస్తుతం డింపుల్‌పై కేసు కోర్టులో నడుస్తోంది.

Dimple Hayathi: డీసీపీతో వివాదంతో.. వెలుగులోకి వచ్చిన డింపుల్ సీక్రెట్ వ్యవహారం

అసలు గొడవ ఏమో కానీ తాజాగా డింపుల్‌(Dimple Hayathi)కి సంబంధించిన సీక్రెట్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు ఒకే అపార్ట్‌మెంటులో కలిసి ఉంటున్నారన్న విషయం బయటపడింది. నిజానికి డింపుల్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి రూమర్స్ రాలేదు. కానీ తాజాగా గొడవతో ఈ సీక్రెట్ బయటపడింది. డేవిడ్ విక్టర్ అనే వ్యక్తితో కలిసి డింపుల్ చాలా కాలంగా సహజీవనం చేస్తోందట.

Google News