Harsha Sai: యూట్యూబ్ స్టార్ హర్ష సాయి.. సినిమాల్లోకి వస్తున్నాడట..

Harsha Sai: యూట్యూబ్ స్టార్ హర్ష సాయి.. సినిమాల్లోకి వస్తున్నాడట..

యూట్యూబ్ స్టార్ హర్ష సాయి(Youtube star Harsha Sai).. పేరు తెలియని వారుండరు. ఆయన తన సాయం చేసే గుణంతో బాగా పాపులర్ అయ్యారు. సమాజంలోని సాయం అవసరం ఉన్న పేదలను గుర్తించి మరీ సాయం అందించి దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఎక్కడెక్కడికో వెళ్లి మరీ సాయం అందించాడు. పేదల గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. దీంతో హర్ష సాయి(Harsha Sai) తెగ ఫేమస్ అయిపోయాడు.

సినిమాల్లోకి యూట్యూబ్ స్టార్ హర్ష సాయి

ఇప్పుడు హర్ష సాయి(Youtube star Harsha Sai) సినిమాల్లోకి రావాలని భావిస్తున్నాడట. దీనికి అంకురార్పణ కూడా జరిగిందని టాక్. నిజానికి హర్ష గురించి తెలుసుకున్న చాలా మంది పొలిటీషియన్స్ ఆయన రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించారట. కానీ ఆయన తిరస్కరించినట్టు సమాచారం. సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖకు వచ్చిన నేపథ్యంలో హర్ష వెళ్లి ఆయనను కలిశాడు. దీంతో హర్ష సినిమాల్లోకి రావడం ఖాయమనే ప్రచారం బయలుదేరింది.

అయితే హర్ష సాయి(Harsha Sai) ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ సినిమాకు డైరెక్టర్ కూడా హర్షసాయియే(Harsha Sai). బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ తీస్తున్న కొత్త సినిమాలో హర్ష భాగం అయినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

హర్షకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మిలియన్ల కొద్దీ ఉన్నారు. హర్ష యూట్యూబ్ ఛానెల్‌కు 8.64 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్, ఇతర సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు.

Google News