Akhil Akkineni: అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావడానికి ఇదా కారణం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులకు కొదువేం లేదు. కొన్ని కుటుంబాలు తరతరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాయి. వాటిలో మెగా ఫ్యామిలీ, అల్లు వారి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ తదతర కుటుంబాలున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao)తో ప్రారంభమైంది. ఇండస్ట్రీని శాసించిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆ తరువాత ఆయన తనయుడు నాగార్జున కూడా బాగా క్లిక్ అయ్యారు. యువ సామ్రాట్, కింగ్‌గా ఇండస్ట్రీలో ముద్ర వేసుకున్నారు.
ఇక అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వారసులు నాగ చైతన్య, అఖిల్. అంతో ఇంతో నాగ చైతన్య(Naga Chaitanya) పర్వాలేదనిపించాడు. ఆయన కెరీర్‌లో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. కానీ అఖిల్(Akhil Akkienni) సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినంతగా మరే హీరో సినిమాలు కాలేదు. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లకేళ్లు గడుస్తున్నా కూడా ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. కనీసం యావరేజ్ హిట్ అన్న మాట కూడా రాలేదు. దీనికి కారణం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి సిసింద్రీ మూవీతో అడుగు పెట్టిన అఖిల్(Akhil Akkineni)ను చూసిన వారంతా.. ఇండస్ట్రీని శాసించే హీరో అవుతాడని అనుకున్నారు. కానీ హిట్ కోసమే ఇంతలా తపస్సు చేస్తాడనుకోలేదు. ‘అఖిల్’ అనే టైటిల్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమా మొదలు మొన్న రిలీజైన ఏజెంట్ వరకూ హిట్ అనేది లేదు.
దీనికి కారణం తన పేరు ముందు నాగ లేకపోవడమేనట. నాగేశ్వరరావు మొదలు.. నాగార్జున, నాగ చైతన్య పేర్లకు ముందు నాగ ఉంటుంది. అఖిల్ పేరుకు ముందు నాగ లేకపోవడంతో కలిసి రావడం లేదని ప్రచారం జరుగుతోంది.