Tiger Nageswararao: రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి మీకు తెలుసా?

Tiger Nageswararao: రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి మీకు తెలుసా?

స్టువర్టుపురం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దొంగతనాలకు అడ్డాగా స్టువర్టుపురాన్ని చెప్పుకుంటాం. అయితే ఈ స్టువర్టుపురాన్ని ఏలిన దొంగ ఒకరున్నారు. ఆయనే టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao). ఈయన పేరు మీదనే రవితేజ హీరోగా సినిమా వస్తోంది. అసలు ఎవరీ టైగర్ నాగేశ్వరరావు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ప్రారంభమైంది. టైగర్ నాగేశ్వరరావు అసలు పేరు.. గరిక నాగేశ్వరరావు.

గరిక నాగేశ్వరరావు(Garika Nageswararao).. తెలుగు వాళ్లంతా అప్పట్లో ముద్దుగా టైగర్ అని.. ఆంధ్ర రాబిన్‌హుడ్ అని పిలిచేవారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు. అయితే నాగేశ్వరరావు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదట. జనాలు కనీసం పట్టించుకోకపోగా.. మనుషులుగా కూడా గుర్తించలేదట. ఆ కోపంతో దొంగతనాలు ప్రారంభించారని సమాచారం. నాగేశ్వరరావు ఆ తరువాత ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ఉమ్మడి ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను దొంగతనాలతో గడగడలాడించాడు.

Tiger Nageswararao: రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి మీకు తెలుసా?

కర్నూలు జిల్లా బనగానపల్లిలో నాగేశ్వరరావు(Nageswararao) గ్యాంగ్ చేసిన బ్యాంక్ దోపిడీ.. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ. అయితే నాగేశ్వరరావు చెడ్డ వాడేమీ కాదట. ఉన్నోడిని కొట్టి లేనోళ్లకు పెట్టేవాడట. ఇక జైలు నుంచి తప్పించుకోవడంలోనూ దిట్ట అట. దీంతో ఆయనకు టైగర్ అనే పేరు వచ్చిందట.

పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) 1987లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. చనిపోయే నాటికి అతని వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు ఈయన జీవితం ఆధారంగానే టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతోంది.

Google News