Upasana: ఉపాసన ప్రెగ్నెన్సీకి.. జపాన్‌కు సంబంధం ఉందట.. మ్యాజిక్ జరిగింది అక్కడేనట

Upasana: ఉపాసన ప్రెగ్నెన్సీకి.. జపాన్‌కు సంబంధం ఉందట..

మెగా కోడలు ఉపాసన కొణిదెల(Upasana Konidela) మరో రెండు మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే మెగా కోడలి సీమంతం వేడుకలు రెండు సార్లు జరిగాయి. దుబాయ్‌లో ఆమె స్నేహితులంతా కలిసి ఒకసారి, హైదరాబాద్‌లో కుటుంబం పెద్ద ఎత్తున మరోసారి నిర్వహించింది. మెగా వారసుడి కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. అయితే ఉపాసన(Upasana Konidela) ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

అంతర్జాతీయ వేదిక జీ 20 సదస్సులో రామ్ చరణ్(Ram Charan) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో కొన్ని సీక్రెట్స్ కూడా చెర్రీ బయటపెట్టాడు. రామ్ చరణ్ ఉపాసన(Upasana Konidela) ప్రెగ్నెన్సీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సదస్సులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తనకు యూరప్ అంటే చాలా ఇష్టమని.. ఇప్పుడు జపాన్ దేశాన్ని అమితంగా ఇష్టపడుతున్నానని తెలిపాడు. జపాన్ దేశమన్నా.. అక్కడి సంస్కృతి, ప్రజలు, సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు.

Upasana: ఉపాసన ప్రెగ్నెన్సీకి.. జపాన్‌కు సంబంధం ఉందట..

తన భార్య ఉపాసన(Upasana Konidela)కు ప్రస్తుతం ఏడో నెల అని.. తనకు పుట్టబోయే బిడ్డకు జపాన్ దేశంతో సంబంధం ఉందని తెలిపి రామ్ చరణ్ ఆసక్తిని రేకెత్తించాడు. ఆ మ్యాజిక్ జరిగింది అక్కడేనని చెప్పాడు. అందుకే తనకు జపాన్ అంటే ప్రత్యేక అభిమానమని చెర్రీ తెలిపాడు. చెర్రీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేసిన సమయంలో చిత్ర యూనిట్ అంతా జపాన్‌కు వెళ్లింది. చెర్రీతో పాటు ఉపాసన(Upasana Konidela) కూడా అప్పుడు వెళ్లారు. అక్కడే ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం చెర్రీకి తెలిసిందట. అదే అక్కడ జరిగిన మ్యాజిక్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!