Ram Charan: జీ 20 సదస్సులో ఆకట్టుకున్న రామ్ చరణ్

Ram Charan: జీ 20 సదస్సులో ఆకట్టుకున్న రామ్ చరణ్

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్‌లో జీ 20(G20) అంతర్జాతీయ సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు ఒక అతిథిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరుపున రామ్ చరణ్ హాజరయ్యాడు. ఆయనను అక్కడికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎంతో గౌరవించారు. వాళ్ళందరి సమక్షంలో రామ్ చరణ్ చక్కటి ప్రసంగం ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ 20 సమ్మిట్‌(G20 Summit)కి ఆయనను ఆహ్వానించారంటేనే ఆయన ఏ స్థాయికి ఎదిగారనేది తెలుస్తోంది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల మన భారతదేశ సంస్కృతి, నాగరికత గురించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరుపున ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపాడు. ఒక అద్భుతమైన కంటెంట్‌ని ఉన్నతమైన విలువలతో వెండితెర మీద ఆవిష్కరించే గొప్పదనం మన ఇండియన్ సినిమాకు ఉందని తెలిపాడు.

Ram Charan: జీ 20 సదస్సులో ఆకట్టుకున్న రామ్ చరణ్

ఇక రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’(Game Changer) అనే మూవీలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్(RRR Movie)) సినిమా చేస్తూనే నటించిన ఆచార్య(Acharya) చిత్రం రామ్ చరణ్‌కి అట్టర్ ఫ్లాప్‌ను అందించింది. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ మూవీ మరో ఆచార్య కాకుండా చెర్రీ జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం అంటేనే సినిమా సూపర్ హిట్ అవుతుందనే టాక్ ఉంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!