Ray Stevenson: ‘ఆర్ఆర్ఆర్’ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

Ray Stevenson: 'ఆర్ఆర్ఆర్' నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) రూపొందించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో ప్రతినాయకుడిగా, బ్రిటీష్ గవర్నర్‌గా నటించి మెప్పించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్(Ray stevenson) కన్నుమూశారు. థోర్ సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆయన ఆకస్మిక మరణ వార్తను తెలుసుకున్న ఆర్ఆర్ఆర్(RRR) బృందం సంతాపం తెలియజేస్తూ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది.

స్టీవెన్సన్(Ray stevenson) నార్త్ ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో నటనలో శిక్షణ పొందారు. అనంతరం ఆయన బ్రిటీష్ టెలివిజన్‌లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. 1990ల్లో టీవీ షోలతో ఆయన తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1998లో పాల్ గ్రీన్‌గ్రాస్ 1998 నాటి చిత్రం ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’తో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.

Ray Stevenson: 'ఆర్ఆర్ఆర్' నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

స్టీవెన్‌సన్‌(Ray stevenson)కు ఇటాలియన్ మానవ శాస్త్రవేత్త ఎలిసబెట్టా కరాసియాతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ మూవీతో చాలా దగ్గరయ్యారు. ఈ సినిమాలో ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా కూడా తెలుగు వారి గుండెల్లో మంచి నటుడిగా నిలిచిపోయారు. 6 అడుగుల4 అంగుళాల ఎత్తున్న స్టీవెన్సన్(Ray stevenson) రోమ్‌లో రోగ్ టైటస్ పుల్లో పాత్ర పోషించారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది.