Dimple Hayathi: కారును ఢీకొట్టి.. నానా రచ్చ చేసిన డింపుల్ హయతి.. కేసు నమోదు

Dimple Hayathi: కారును ఢీకొట్టి.. నానా రచ్చ చేసి డింపుల్ హయతి.. కేసు నమోదు

ఐపీఎస్ అధికారితో టాలీవుడ్ నటి, రామబాణం(Ramabanam) హీరోయిన్ డింపుల్ హయతి(Dimple Hayathi) తగవు పెట్టుకుంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టడమే కాకుండా కాలితో తంతూ నానా రచ్చ చేసింది. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్‌లో నటి హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని డింపుల్ హయతి(Dimple Hayathi) కాబోయే భర్త డేవిడ్ పార్కింగ్ ప్లేస్‌లో ఢీ కొట్టాడు. 

వెంటనే రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చేతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు డింపుల్‌ హయతిపై 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. డింపుల్ పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్టు కేసు పెట్టారు. పలుమార్లు ఐపీఎస్ అధికారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా డింపుల్ హయతి(Dimple Hayathi) తీరు మార్చుకోలేదని చెబుతున్నారు. ఆగడాలు శృతిమించడంతో ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.

ఖిలాడి(Khiladi), రామబాణం సినిమాతో అమ్మడు కాస్త పాపులర్ అయ్యింది. సినిమా ప్లాఫ్ అయినా కూడా అమ్మడికి కాస్త కలిసొచ్చింది. డింపుల్ కోసం తాను ఓ గుడి కట్టించాలని అనుకుంటున్నానని.. అది పాలరాయితో కట్టించాలా లేక ఇటుకరాయితో కట్టించాలా అని ఓ అభిమాని ఇటీవల అడిగాడు. దీనికి డింపుల్ షాకింగ్ సమాధానం ఇచ్చింది. తనకు బంగారంతో గుడి కట్టిస్తే హ్యాపీగా ఫీలవుతానని తెలిపింది. అంతే ఆ నెటిజన్‌కు సౌండ్ లేదు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!