NTR: ఆస్కార్ వచ్చిన విషయాన్ని మొదట ఆమెకే చెప్పా : ఎన్టీఆర్

NTR

అమెరికా నుంచి హైదరాబాద్‌కు నేటి తెల్లవారుజామున యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Jr NTR) చేరుకున్నారు. ఆయన వస్తున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తారక్ (NTR) మీడియాతో మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు (Oscar Award) తమ బాధ్యతను మరింత పెంచిందన్నాడు. రాజమౌళి(Rajamouli) చేతిలో ఆస్కార్ చూసి కళ్లలో నీళ్లు తిరిగాయన్నాడు.

ఆస్కార్ (Oscar) వచ్చిన విషయాన్ని మొదటగా తన భార్యకు ఫోన్ చేసి చెప్పానని ఎన్టీఆర్ (NTR) వెల్లడించాడు. ఆస్కార్‌ (Oscar) వేదికపై పెర్ఫార్మెన్స్‌ను జీవితంలో మరిచిపోలేనన్నారు. ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ (RRR Movie) టీంకు వచ్చిన దానికి మించిన ఆనందం మరొకటి లేదని స్పష్టం చేశాడు. తమను ఇక్కడివరకు తీసుకొచ్చిన.. ప్రజలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తారక్‏ (Jr NTR)తో పాటు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshith) సైతం నగరానికి చేరుకున్నారు. లాస్ ఏంజిల్స్ సాక్షిగా ఆర్ఆర్ఆర్ (RRR) రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Ntr With Wife Pranathi

‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ ప్రకటించగానే చిత్ర యూనిట్ మాత్రమే కాదు. దక్షిణాది ప్రజానీకం అంతా ఆనందంలో మునిగిపోయింది. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani), గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) అందుకున్నారు. ఈ ఆస్కార్ వేడుకలో జక్కన్న దంపతులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక ఎన్టీఆర్ (NTR) అయితే జాతీయ జంతువు పిక్‌తో ఉన్న బ్లేజర్‌ను ధరించి ఇండియా గొప్పతనాన్ని చాటాడు

Google News