Allu Arjun: ఆస్కార్‌పై లేటుగా స్పందించిన బన్నీ.. బీభత్సంగా ట్రోల్స్

Allu Arjun on RRR Naatu Naatu wins Oscar

ఇండియన్ మూవీ ఆస్కార్ (Oscar) సాధించడం అనేది ఓ కల. అలాంటి కల నెలవేరింది. అది కూడా తెలుగు సినిమాలోని ఓ పాటకు ఆస్కారం దక్కడమనేది నిజంగా చాలా సంతోషించదగిన పరిణామం. ఆస్కార్ (Oscar) కలను ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మూవీతో రాజమౌళి నెరవేర్చాడు. ఆస్కార్‌కి నామినేట్ అవడమే అదృష్టంగా భావిస్తారు. అలాంటిది అవార్డ్ దక్కించుకోవడమంటే ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.

ఇక దక్షిణాదికి చెందిన సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్న తీరు మాటల్లో చెప్పలేనిది. అలా అవార్డ్ వచ్చిందనే ప్రకటన వచ్చిందో లేదో క్షణాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తించారు ఒక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తప్ప. నిజానికి ముందుగా విషెస్ చెప్పాల్సిన బన్నీ (Allu Arjun) ఒకరోజు లేటుగా తీరికగా చెప్పాడు. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

అలాగే రామ్ చరణ్ (Ram Charan) ను లవ్లీ బ్రదర్ అంటూ… ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గర్వకారణం అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నాడు. వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ఈ మేజిక్ క్రియేట్ చేసిన రాజమౌళి (Rajamouli)కి అల్లు అర్జున్ అభినందనలు తెలిపాడు. ఇక బన్నీ ఒకరోజు లేటుగా స్పందించడంపై నెటిజన్స్ ఆయనపై మండిపడ్డారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ ఫైర్ అయ్యారు. నిన్న డేటా అయిపోయిందా? ఈ రోజు ట్వీట్ చేశావంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. ఇక ఫ్యాన్స్ మాత్రం బన్నీ (Allu Arjun)షూటింగ్‌లో ఉండటం వల్ల లేటుగా స్పందించి ఉంటాడని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!